సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 6 to 10 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 6 to 10

6. నా వయసు 42. మావారి వయసు 46. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే ఈ మధ్య నాకు శృంగారం మీద కాస్త ఆసక్తి తగ్గుతోంది. మావారు రోజూ కావాలంటారు కానీ నాకెందుకో కావాలనిపించడం లేదు. అలా అని శారీరకంగా ఏ ఇబ్బందీ లేదు. దాంతో మావారు కోరికలు పెరగడానికి టీవీలో చూపిస్తోన్న మాత్రలు వేసుకొమ్మని అంటున్నారు. అవి వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయంగా ఉంది. నా భయం నిజమేనా?

ఆడవారిలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి… నలభై సంవత్సరాలు దాటిన తర్వాత హార్మోన్లలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అండాశయాల పనితీరు మందగించడం వల్ల, దాని నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. ఆడవారిలో కోరికలను ప్రేరేపించేది ఈస్ట్రోజన్ హార్మోనే. అది తగ్గడం వల్ల కొందరికి సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుంది. అలాగే ఈ వయసులో పిల్లల బాధ్యతలు, వారి భవిష్యత్తును గురించిన  ప్రణాళికల చుట్టూనే మనసు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా సెక్స్‌పై ఆసక్తి తగ్గుతుంది.

అలా అని కోరికలు పెరగడానికి సొంతగా మందులు వాడకూడదు. దానివల్ల దుష్ఫలితాలు కలగవచ్చు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఆ దుష్ఫలితాలు ఎక్కువగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి సమస్యను వివరించండి. మీకు ఆసక్తి తగ్గడానికి గల కారణాన్ని అన్వేషించి, హార్మోన్ ట్యాబ్లెట్లు, క్రీములు వంటివి ఇస్తారు. ( డా. వేనాటి శోభ )

7. నా వయసు 20. పెళ్లై నెల కావస్తోంది. అయితే కలయిక కోసం ప్రయత్నించినసారీ చాలా ఇబ్బంది వస్తోంది. మావారి అంగం నా యోనిలోకి పూర్తిగా వెళ్లడం లేదు. కొంత దూరం వెళ్లి ఆగిపోతోంది. ఏదో అడ్డు తగులుతోంది, వెళ్లడం లేదు అంటున్నారు. లోపల వేలు పెట్టి చూసినా ఏదో తగులుతున్నట్టే అనిపిస్తోంది. అదేంటో నాకు తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?

సాధారణంగా ఆడపిల్లల్లో యోని  ద్వారం, హైమన్ ద్వారా కప్పబడి ఉంటుంది. దీనినే కన్నెపొర అంటాం. ఈ పొర కొందరిలో పలచ్చగా ఉండి, యోని రంధ్రం చుట్టూ ఉంటే… కొందరిలో మాత్రం సగం వరకే ఉంటుంది. కొందరిలో అయితే జల్లెడలా ఉంటుంది. మరికొందరిలో ఈ పొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసేసి ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. కొందరికి మాత్రం పొర బాగా మందంగా ఉంటుంది. పొర కనుక పలుచగా ఉంటే… మొదటి కలయిక సమయంలో అది చిరిగిపోయి, అంగం లోపలికి వెళ్లగలుగుతుంది.

అదే మందంగా ఉన్నట్లయితే… అంగాన్ని పూర్తిగా లోనికి వెళ్లనివ్వకుండా కలయికకు అడ్డు పడుతుంది. కొంతమందికి యోని లోపల అడ్డుగోడలా పొర (సెప్టమ్) ఉండవచ్చు. అలాంటప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తారు. మరి మీకు కన్నెపొర సమస్య వస్తోందో లేక వేరే ఏదైనా సమస్య ఉందా అన్నది పరీక్ష చేసి నిర్ధారించాలి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ను కలవండి. కారణాన్ని తెలుసుకుని దానికి తగిన చికిత్స చేస్తారు. ( డా. వేనాటి శోభ )

8. నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.

మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో  చాలా సాధారణంగా కనిపించే సమస్య. వీర్యస్ఖలనం అన్నది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ. సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్ఖలనం అన్న రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) త్వరగా కలగడం వల్ల వీర్యస్ఖలనం వెంటనే జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

9.  నా వయుస్సు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నేను గతంలో కొంతమంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. నాకు ఇటీవలే పెళ్లి నిశ్చయుం అరుు్యంది. ఆ అవ్మూరుుతో కూడా నేనొకసారి కలవడానికి ప్రయత్నించాను. అరుుతే అప్పుడు అంగస్తంభన సరిగా జరగలేదు. ఒక్క నిమిషంలోనే వీర్యస్ఖలనం అరుుపోరుుంది. నేను సెక్స్ జీవితానికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయుచేసి సలహా ఇవ్వండి.

మీది యూంగ్జైటీ న్యూరోసిస్ అనే వూనసిక సవుస్య కావచ్చు. మీకూ, మీ జీవిత భాగస్వామికీ కొంత పరిచయుం పెరిగిన తర్వాత క్రవుంగా మీ భయూలు తగ్గి మీరు నార్మల్‌గా సెక్స్ చేయుడానికి వీలుంటుంది. పెళ్లికాకవుుందే సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఇలాంటి భయూలూ, అపోహలు ఎక్కువవుతారుు. కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని  భయూందోళనలు లేని సెక్స్ జీవితాన్ని గడపండి. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

10. నా వయస్సు 28 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను. అయితే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కలలో స్ఖలనం అవుతోంది. స్వప్నస్ఖలనాల వల్ల సెక్స్ బలహీనత వస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది. మందు ఇస్తామని కొందరు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి.

యౌవనదశలో మీలాగా హస్తప్రయోగం చేసుకోవడం పురుషులందరిలోనూ దాదాపుగా ఉండే అలవాటు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదు. మీరు అనవసరంగా అపోహతో హస్తప్రయోగం ఆపేశారు. అయితే మీరు ఈ ప్రక్రియను ఆపేసినా వృషణాల్లో వీర్యం ఉత్పత్తి ప్రక్రియ అలాగే కొనసాగుతుంటుంది. ఇలా ఉత్పన్నం అయిన వీర్యం మీకు నిద్రలో పోతోంది. ఇది స్వాభావికంగా జరిగే ఒక ప్రక్రియ. దీనికోసం మందులు వాడనవసరం లేదు. మందులు ఇస్తామంటున్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు బహుశా మీ బలహీనత నుంచి లబ్ధిపొందుతున్నారు. మీరు అన్నివిధాలా నార్మల్‌గా ఉన్నారు. మందులు వాడనవసరం లేదు. కెరియర్‌లో స్థిరపడి త్వరగా పెళ్లిచేసుకొని, మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయండి. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

Telugu Sexology – Doubts and Advice 11 – 15

Read Telugu Sexology – Counselling 1 – 5

One Response to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 6 to 10 | Telugu Sexology”
  1. ravi October 2, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *