సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 31 to 35 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 31 – 35

31. నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్‌ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా?

 తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి. ( డా. వేనాటి శోభ )

32. నా వయసు 29. పెళ్లై ఏడేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా కలయిక సమయంలో నాకు యోని బాగా నొప్పి పుడుతోంది. చర్మం కూడా కట్ అవుతోంది. మావారికి కూడా అలానే అవుతోంది. పైగా ఆయన అంగం పైన చర్మం పొరలుగా ఊడుతోంది. ఇలా ఎందుకు అవుతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?

కలయికలో నొప్పి వస్తోంది, చర్మం కట్ అవుతోంది అంటున్నారు. మీవారికి కూడా అలాగే అవుతోంది కాబట్టి ఇద్దరికీ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, కలయిక ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు గైనకాలజిస్టును, మీవారు డెర్మటాలజిస్టును కలిసి సమస్య వివరిం చండి. తగిన చికిత్స తీసుకోండి. చికిత్స పూర్తయ్యేవరకూ దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా కలిస్తే, ఇన్ఫెక్షన్ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అలాగే తగ్గిన తర్వాత కూడా ఒక వారం పాటు కండోమ్ వాడటం మంచిది. ( డా. వేనాటి శోభ )

33. నాకు 35 ఏళ్లు. గత రెండేళ్లుగా వుూత్రంలో వుంట, వుూత్రధార సరిగా రాకపోవడం, సెక్స్ చేసినప్పుడు వీర్యం సరిగా రాకపోవడం వంటి బాధలు అనుభవిస్తున్నాను. సెక్స్ చేసినా, వుూత్రం పోసినా పొత్తికడుపులో బిగదీసుకుపోరుునట్లుగా ఉంటోంది. దాంతో సెక్స్ అంటేనే భయుమేస్తోంది. పెళ్లికి వుుందు కండోమ్ లేకుండా చాలాసార్లు చాలావుందితో సెక్స్‌లో పాల్గొన్నాను. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయేమోనని చాలా యూంటిబయూటిక్స్ వాడాను. అరుునా ప్రయోజనం లేదు. నాకు వుంచి సలహా ఇవ్వండి.

మీరు మీ సవుస్యకు ముందుగా రిట్రోగ్రేడ్ యుురెథ్రోగ్రామ్ (ఆర్‌జీయుూ) అనే పరీక్ష చేరుుంచుకోవాలి. దీనిల్ల వుూత్రనాళంలో ఏదైనా అడ్డంకి (బ్లాక్) ఉందేమో తెలుస్తుంది. అలా ఉంటే ఎండోస్కోపీ ప్రక్రియు ద్వారా వుూత్రనాళాన్ని వెడల్పు చేరుుంచుకుంటే వుూత్రం, వీర్యం రెండూ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వెంటనే యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

34. నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా?

సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్‌లో లేకపోవడం సర్వసాధారణం. వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ, సెక్స్ సామర్థ్యానికి సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కానేకాదు. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

35. నా వయస్సు 18 ఏళ్లు. నాకు గత నాలుగేళ్లుగా రొమ్ములు ఉన్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు

మీ సమస్యను గైనకోమేజియా అంటారు. కొన్ని సందర్భాల్లో హార్మోన్‌ల అసమతౌల్యం (హార్మోనల్ ఇంబ్యాలెన్స్)వల్ల … అంటే ఈస్ట్రోజెన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ తక్కువైనప్పుడు  ఇలా జరగవచ్చు. మీ రొమ్ము భాగం బయటకు కనిపించేంత పెద్దగా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల వచ్చిన లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఈ బ్రెస్ట్‌లోని ఫ్యాట్‌ను ఆపరేషన్ లేకుండా కూడా తొలగించుకోవచ్చు. కాకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకోడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో తెలుసుకొని, ఒకవేళ ఉంటే దాన్ని చక్కదిద్దడానికి ఓసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

Telugu Sexology – Doubts and Advice 36 – 40

Read Telugu Sexology – Counselling 1 – 5

2 Responses to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 31 to 35 | Telugu Sexology”
  1. Anil November 21, 2015
  2. Raju October 2, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *