సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 16 to 20 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 16 – 20

16. నా వయసు 28 ఏళ్లు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పురుషాంగాన్ని ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్య నన్ను ఆందోళనకు గురిచేస్తోంది.  నాకు తగిన సలహా ఇవ్వండి.

పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే పరిస్థితిని ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పిరావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడం వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయుడానికీ అనువుగా ఉంటుంది. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

17. నాకు 35 ఏళ్లు. పెళ్లయి పదేళ్లు అయ్యింది. సెక్స్ చేసిన తర్వాత మూత్రనాళంలో మంట అనిపిస్తోంది. చాలా నీరసంగా ఉంటోంది. ఏడాది క్రితం కనీసం రోజులో ఒకసారి సెక్స్ చేయగలిగే. వాణ్ణి. ఇప్పుడు వారానికి రెండుసార్లు మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నాను. ఈమధ్య నాకు షుగర్ కూడా వచ్చింది. దీనివల్లనే ఈ సమస్య వచ్చిందా? నా సమస్యకు పరిష్కారం చూపగలరు.

సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహమైన 10 ఏళ్ల తర్వాత ముందున్నంత ఉత్సాహం ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లలో ముఖ్యంగా ఒకేచోట కుదురుగా కూర్చుని పనిచేసేవాళ్లలో (సెడెంటరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్‌సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికితోడు ఆ ఈడులో ఉండే బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనికి కౌన్సెలింగ్ ద్వారా, కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. మీ బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా మీ సామర్థ్యలోపాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

18. నా కంఠస్వరం మరీ మహిళల గొంతులా ఉంటోంది. దాంతో నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను. ఇది హార్మోన్ల సమస్య అని, యాండ్రాలజిస్ట్‌ను కలవమని కొందరు సూచించారు. ఒక డాక్టర్‌ను కలిస్తే చిన్నప్పట్నుంచీ గొంతు అలాగే ఉంటే యాండ్రాలజిస్ట్‌ను కలిసినా లాభంలేదు అంటున్నారు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వండి.

మీకు సెక్స్ కోరికలు, అంగస్తంభనలతో పాటు సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్ అయిన  మీసాలు-గడ్డాలు పెరగడం నార్మల్‌గా ఉంటే… మీ శరీరంలోని హార్మోన్ల సమతౌల్యం బాగానే ఉందని అర్థం. ఇలా ఉంటే మీరు మీ సెక్స్ జీవితం విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. పదమూడో ఏటి నుంచి 20 ఏళ్ల వరకు సెకండరీ సెక్సువల్ కారెక్టర్లలో భాగంగానే పురుషుల్లో స్వరం మార్పు జరుగుతుంది. దీనికి అనేక జన్యుపరమైన అంశాలు దోహదపడతాయి. అన్ని హార్మోన్లూ నార్మల్‌గా ఉన్నా కొందరిలో స్వరంలో ఇలా కీచుదనం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఉండదు. అయినా ఒకసారి మీరు హార్మోన్ల పరీక్ష చేయించుకుని యాండ్రాలజిస్ట్‌ను గాని, ఈఎన్‌టీ సర్జన్‌ను గాని కలవండి. (  డాక్టర్ వి. చంద్రమోహన్ )

19. నా వయసు 18. చదువుకుంటున్నాను. ఎందుకో మొదట్నుంచీ నా వక్షోజాలు చాలా వదులుగా ఉంటాయి. మొన్నీమధ్య ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక మాట అంది. జారిపోయినట్టుగా ఉండే వక్షోజాలను చూస్తే మగవాళ్లకు అనుమానం వస్తుందట. అంతకుముందే ఎవరితోనో సంబంధం ఉందని అనుకుంటారట. అది నిజమేనా? రేపు నా భర్త కూడా నన్ను అలానే అనుమానిస్తే నా పరిస్థితి ఏమిటి? పరిష్కారం చెప్పండి.

మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. వక్షోజాలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరికి బిగుతుగాను, బలహీనత వల్ల కొందరిలో వదులుగాను ఉంటాయి. అంతేకానీ ఎవరితోనో సంబంధం ఉండటం వల్ల అవి వదులు కావు. అనవసరమైన మాటలు విని కంగారు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వక్షోజాల్లో పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. కొవ్వు సరిపడినంత లేకపోవడం వల్ల కూడా పటుత్వం లేక వక్షోజాలు వదులుగా ఉండ వచ్చు. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉంటే… పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోండి. దానివల్ల అవి మళ్లీ బిగుతుగా తయారయ్యే అవకాశం ఉంది. ( డా. వేనాటి శోభ )

20. నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. ఈ మధ్యనే డాక్టర్‌కి చూపిస్తే… నా గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. అయితే ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా?

గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు… ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు.

సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి.

అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే… లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. ( డా. వేనాటి శోభ )

Telugu Sexology – Doubts and Advice 21 – 25

Read Telugu Sexology – Counselling 1 – 5

2 Responses to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 16 to 20 | Telugu Sexology”
  1. Raju December 6, 2015
  2. sri September 22, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *