సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 11 to 15 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 11 to 15 

11. నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా?

అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే… అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే… అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు…. నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది.

కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది. ( డా. వేనాటి శోభ)

12. నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి?

హస్తప్రయోగం వల్ల యోని వదులైపోవడం అనేది ఉండదు. కాకపోతే కొన్ని వస్తువులు వాడారు కాబట్టి కన్నెపొర చిరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొందరిలో కన్నెపొర చిన్నతనంలో ఆటలాడేటప్పుడు, సైకిల్ తొక్కడం లాంటివి చేసినప్పుడు చిరిగిపోతుంది. మరికొందరి కన్నెపొరకు సాగే గుణం ఉంటుంది. అలాంటివారికి మొదటిసారి కలిసినప్పుడు రక్త రావడం జరగదు. అయినా మొదటిరాత్రి అందరికీ రక్తం రావాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడకండి. పెళ్లి చేసుకోబోతున్న ఆనందాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉండండి. ( డా. వేనాటి శోభ)

13. నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా?

కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి… పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్‌తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది. ( డా. వేనాటి శోభ)

14. నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?

కొందరి శరీర తత్వాన్ని బట్టి… సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది.

మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది. ( డా. వేనాటి శోభ)

15. నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్‌ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు. కాకపోతే కాలేజీలో చదువు కున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండక పోతే ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీవారికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంది అంటే, ఆయన రక్తంలో హెచ్‌ఐవీ వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ రక్తం ద్వారా లేదా కలయిక ద్వారా మీకు వచ్చివుండే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే హెచ్‌ఐవీ రక్తపరీక్ష చేయించుకోండి. దానివల్ల మీకు హెచ్‌ఐవీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అదృష్టం కొద్దీ లేకపోతే… కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీకి మందులు అందుబాటులో ఉంటున్నాయి. మీవారికి ఆ మందులు ఇప్పించండి. కలయిక సమయంలో మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడండి. అలాగే ఈ పరీక్షలో హెచ్‌ఐవీ లేదని తేలినా… ఆరు నెలల తర్వాత మరోసారి హెచ్‌ఐవీ పరీక్ష తప్పకుండా చేయించుకోండి. ( డా. వేనాటి శోభ)

Telugu Sexology – Doubts and Advice 16 – 20

Read Telugu Sexology – Counselling 1 – 5

One Response to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 11 to 15 | Telugu Sexology”
  1. premsagar September 4, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *