సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 1 to 5 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 1 to 5 

1. నా వయసు ముప్ఫై. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సిజేరియన్ పడింది. మావారూ నేనూ సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయనకు ఆనల్ సెక్స్ ఇష్టం. కానీ అలా చేస్తే కుట్లు తెగిపోతాయని ఎవరో చెప్పడంతో భయపడుతున్నారు. అలాగే ఆనల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని విన్నాను. నిజమేనా?

ఆనల్ సెక్స్ అంటే… మగవారు తమ అంగాన్ని ఆడవారి మలద్వారంలోకి పంపించి, భావప్రాప్తిని పొంది ఆనందించడం. ఇది మగవారి విపరీత కోరికలకు తార్కాణం. దీనివల్ల ఆడవారికి ఎటువంటి సంతోషం, తృప్తి కలగవు. పైగా ఒక్కోసారి మలద్వారం చిట్లిపోయి, రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మలం విసర్జించేటప్పుడు నొప్పిగా ఉండవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సెక్స్ అనేది ఇద్దరూ కలిసి సంతోషంగా చేసు కునేది తప్ప… ఒకరు బాధపడుతూ ఒకరు ఆనందించేది కాదు. కాబట్టి ఇది అంత మంచి పద్ధతి కాదు. అయితే మీరు భయ పడుతున్నట్టు ఆనల్ సెక్స్ వల్ల సిజేరియన్ కుట్లు తెగిపోవడం అనేది జరగదు. ( డా. వేనాటి శోభ )

2. నా వయసు 23. పెళ్లి కాలేదు. హాస్టల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. నా రూమ్మేట్ వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీద చేతులు వేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. మొదట్లో సరదాకేమో అనుకున్నాను. కానీ ఇద్దరమ్మాయిలు సెక్స్ చేస్తోన్న వీడియో చూపించి, నన్నూ తనతో అలా ఉండమంటోంది. అలా చేయడంలో తప్పేం లేదంటోంది. తను చెప్పింది నిజమేనా? ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా? దానివల్ల సమస్యలేమీ రావా?

మారుతున్న కాలం మహిమో, సినిమాల ప్రభావమో కానీ.. యవ్వనంలో ఉన్నవారి ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి వాటిలో అన్ని రకాల వీడియోలు తేలికగా కళ్లముందు కనబడు తుంటే… వాటివల్ల ఉత్తేజితం అయ్యి, ప్రేరేపణకు గురవుతున్నారు. అలా వీడియోల్లో కనిపించడం తప్పు కాదనే భావనలో పడుతున్నారు. అలాగే పక్క వారిని కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా అంటే జవాబు చెప్పడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

మన సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటి ప్రకారమే మనం నడుచు కుంటున్నాం. ఇతర పనులు లేకుండా సెక్స్ పైన ఆసక్తి పెరిగి, కోరికలను అణచు కోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొందరు ఆ కట్టుబాట్లు తప్పి ప్రవర్తించడం జరుగు తుంది. ఎవరి ఆసక్తి వారిది. దానివల్ల ప్రత్యేకంగా శారీరక సమస్యలు ఏమీ రావు. కాకపోతే మానసికంగా డిస్టర్బ్ అయ్యి, చేసే పనిలో నిమగ్నం కాలేక పోవచ్చు. అలాగే ఆడపిల్లల మీద ఆసక్తి పెరిగి, పెళ్లయ్యాక భర్తకు దగ్గర కాలేక ఇబ్బంది పడినవాళ్లూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి అడుగేయాలి.( డా. వేనాటి శోభ )

3. నాకు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. నా భర్త, నేను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అయితే నేను పెళ్లికి ముందు చాలాసార్లు నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. కానీ ఎప్పుడూ యోనిలో స్ఖలనం కానివ్వలేదు. ఒక్కసారి మాత్రం యోని దగ్గర చర్మం చిట్లి రక్తం వచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉంటే, నాకూ వచ్చి వుంటుందన్న అనుమానం పీడిస్తోంది. నా భర్తకు ద్రోహం చేస్తున్నందుకు బాధ కలుగుతోంది. నేనేం చేయాలి?

తెలిసి తప్పు చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం! బాధపడి చేసేది కూడా ఏం లేదు కదా! ఎయిడ్స్ గురించి అనుమానం ఉంటే, ఓసారి రక్తంలో హెచ్‌ఐవీ ఉందేమో పరీక్ష చేయించుకోండి. ఏమీ లేదని తెలిస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఒకవేళ ఉందని తెలిస్తే, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మీవారికి కూడా పరీక్ష చెయ్యించాలి. ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల జీవితాంతం బాధ వెంటాడు తూనే ఉంటుంది. మీరు పశ్చాత్తాపం చెందడం మంచిదే.

కానీ ఇలా కుమిలి పోవడం వల్ల ఉపయోగం లేదు. వీలైతే, మీవారు అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంటే… ఓసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడండి. జరిగినదంతా చెప్పి మన్నించమని అడగండి. ఇబ్బందులు వస్తాయి అనుకుంటే జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిం చండి. నిర్ణయం మీదే. ఈ విషయంలో ఎవరం ఏమీ చెప్పలేం, చెయ్యలేం. ( డా. వేనాటి శోభ )

4. నా వయసు 21. బరువు 36 కిలోలు. ఎత్తు 4-5 అడుగుల మధ్య ఉంటాను. నేనింత వరకూ మెచ్యూర్ కాలేదు. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటాను. ఆకలి కూడా సరిగ్గా వేయదు. ఈ మధ్యే డాక్టర్ పరీక్ష చేసి… గర్భసంచి చిన్నగా ఉంది, టీబీ కూడా సోకింది, గర్భసంచిని శుభ్రం చేయాలి అని చెప్పారు. ట్యాబ్లెట్లు ఇస్తే వాడుతున్నాను. నేనిప్పుడు ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది? నా సమస్య తీరుతుందా?

మీరు చాలా తక్కువ బరువున్నారు. మీ ఎత్తుకి 40 నుంచి 45 కిలోల వరకు ఉండవచ్చు. ఆడపిల్లలు గరిష్టంగా పదహారేళ్ల లోపు రజస్వల అవ్వాలి. మీకు టీబీ సోకింది గర్భసంచికేనా లేక ఊపిరి తిత్తులకా? గర్భసంచి చిన్నగా ఉండటం లేదా దానికి టీబీ సోకడం వల్ల గర్భసంచి లోపలి పొర దెబ్బతిని మెచ్యూర్ కాకపోవచ్చు. ఒక్కోసారి జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా అలా జరగవచ్చు. కాబట్టి ఆ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో కూడా పరీక్ష చేయించుకుని, టీబీతో పాటు వాటికి కూడా ఆర్నెల్ల పాటు మందులు వాడండి.

పౌష్టికాహారం తీసుకుంటూ బరువు పెరగడానికి ప్రయత్నించండి. ఆరు నెలల తర్వాత మళ్లీ స్కానింగ్, రక్తపరీక్షలు చేసి… ఆ రిపోర్టును బట్టి ఇంకా ఎటువంటి చికిత్స తీసుకో వడం మంచిది అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. గర్భసంచి మరీ చిన్నగా ఉండి జన్యుపరమైన సమస్యలు కూడా ఉంటే కనుక ఎటువంటి చికిత్సా పని చేయదు. అండాశయాలు ఉన్నాయా, ఒకవేళ అవి కూడా చిన్నగా ఉన్నాయా అన్నది మీరు రాయలేదు. గర్భాశయంతో పాటు అండాశయాలు కూడా సరిగ్గా ఉంటేనే మెచ్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ( డా. వేనాటి శోభ )

5. నా వయసు 21. మూడు నెలల క్రితమే పెళ్లయ్యింది. మావారు చాలా మంచివారు. కానీ మేం ఇప్పటి వరకూ ఒక్కటి కాలేదు. దానికి కారణం నేనే. సెక్స్ చేసినప్పుడు విపరీత మైన నొప్పి వస్తుందని, రక్తం కూడా వస్తుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. దాంతో నాకు చాలా భయమేస్తోంది. మావారు దగ్గరకు రాగానే బిగుసుకుపోతున్నాను. ఆయన ధైర్యం చెబుతున్నా నావల్ల కావడం లేదు. ఆయనకు విసుగొచ్చి నాకు దూరమై పోతారని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.

ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్పారని ముందుగానే భయపడిపోయి, ముందుకు వెళ్లను అంటే ఎలా! సెక్స్ చేసేటప్పుడు మొదట్లో కాస్త నొప్పి ఉండవచ్చు. కానీ అది అందరికీ ఉండాలని లేదు. అలాగే రక్తం రావాలని కూడా లేదు. మీ భయాన్ని పక్కన పెట్టి, మెల్లగా ఇద్దరూ ఒకరికొకరు సహాయపడుతూ, అర్థం చేసుకుంటూ, ఫోర్‌ప్లే ద్వారా ఒకరినొకరు ప్రేరేపించు కుంటూ కలిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. భయంతో బిగుసుకుపోవడం వల్ల కలయిక జరగదు. ఒకవేళ బలవంతంగా ప్రయత్నించినా నొప్పి విపరీతంగా ఉండి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

మీవారు చక్కగా ధైర్యం చెబుతున్న ప్పుడు మీరు భయపడా ల్సిన అవసరం ఏముంది! కావాలంటే మొదట్లో లూబ్రి కేటింగ్ జెల్స్, కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటివి వాడితే నొప్పి తెలియకుండా ఉంటుంది. అంతేకానీ మీరు ఇలా భయ పడుతూనే ఉంటే మీవారికి నిజంగానే విసుగొచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త! ( డా. వేనాటి శోభ )

Telugu Sexology – Doubts and Advice 6 – 10

Read సెక్సాలజీ కౌన్సెలింగ్ – Telugu Sexology

2 Responses to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 1 to 5 | Telugu Sexology”
  1. Rajesh February 7, 2016
  2. sameer November 14, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *